పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ దోపిడీ..బ్రాయిలర్ ట్రేడర్ల ఆగ్రహం

పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ దోపిడీ..బ్రాయిలర్ ట్రేడర్ల ఆగ్రహం
  • తగ్గించిన మార్జిన్​ పెంచాలని డిమాండ్

ఎల్బీనగర్, వెలుగు: పౌల్ట్రీ ఫార్మ్ రంగంలో కార్పొరేట్ కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమను  దోపిడీ చేస్తున్నాయని తెలంగాణ బ్రాయిలర్ కోళ్ల ట్రేడర్ అసోసియేషన్ మండిపడింది. బ్రాయిలర్ కోళ్ల ట్రేడర్లపై రేట్లు పెంచి మార్జిన్​ను తగ్గించడమే కాకుండా, చికెన్ షాప్ రిటైల్ వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొంది. 

మంగళవారం ఎల్బీనగర్​లోని ఓ గార్డెన్‌‌లో అసోసియేషన్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ యాజమాన్యాలు స్వలాభం కోసం అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటూ ట్రేడర్లకు న్యాయబద్ధంగా రావాల్సిన రేట్లను ఇవ్వడం లేదని ఆరోపించారు. బ్రాయిలర్ ట్రేడర్లు, చికెన్ షాప్ వ్యాపారులకు సరైన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా తమకు తగ్గించిన మార్జిన్​ను పెంచాలని డిమాండ్​చేశారు.