మార్కెట్ సైజు​ విషయంలో స్టార్టప్​లు పొరపాటుపడ్డాయి : నితిన్​ కామత్​

మార్కెట్ సైజు​ విషయంలో  స్టార్టప్​లు పొరపాటుపడ్డాయి :  నితిన్​ కామత్​

న్యూఢిల్లీ: మన  దేశ మార్కెట్​ సైజు పది కోట్లు మాత్రమే ఉంటుందని, ఈ విషయంలో స్టార్టప్‌ కంపెనీలు అతిగా ఊహించుకున్నాయని స్టాక్​ బ్రోకింగ్​ కంపెనీ జెరోధా ఫౌండర్​ నితిన్​ కామత్​ అన్నారు. ఫోన్​పే కో–ఫౌండర్​ సమీర్​ నిగమ్​ కూడా ఈ వాదనను అంగీకరించారు. 

బెంగళూరులో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో వీళ్లు మాట్లాడుతూ స్టార్టప్​లు, వెంచర్ ​క్యాపిటల్​ ఇన్వెస్టర్లు మార్కెట్​ సైజు గురించి పొరపాటు అంచనాకు రావడం వల్ల కొన్ని స్టార్టప్‌లలో పాలనాపరమైన సమస్యలు వచ్చాయని అన్నారు. ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా, స్టార్టప్​ మార్కెట్​ సైజు తక్కువగానే ఉందని కామత్​ అన్నారు. 

ఈ సంవత్సరం దీపావళి నాటికి ఫోన్​పే 50 కోట్ల మంది కస్టమర్లను చేరుకుంటుందని, ప్రస్తుతం తమకు 30 కోట్ల వార్షిక యాక్టివ్ యూజర్ బేస్ ఉందని నిగమ్​ చెప్పారు. పది కోట్ల మంది మాత్రమే కంపెనీ ఆర్థిక సేవలను, ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉందని నిగమ్ చెప్పారు.  

మార్కెట్ సైజును పదేళ్ల ముందుచూపుతో అంచనా వేయాలని, టార్గెట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిగమ్ వివరించారు.