చుక్కలు చూపిస్తున్న కార్పొరేట్ స్కూళ్ళు.. ప్లే స్కూల్ కే లక్షల్లో ఫీజులు..

చుక్కలు చూపిస్తున్న కార్పొరేట్ స్కూళ్ళు.. ప్లే స్కూల్ కే లక్షల్లో ఫీజులు..

కార్పొరేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న యాజమాన్యాలు తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల మూడవ తరగతి చదువుతున్న తన కొడుక్కి నెలకు 30వేల రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తోందని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పేరెంట్ చేసిన ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్కూల్ ఫీజుల గురించి మరొక పేరెంట్ చేసిన ట్వీట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

తన కొడుకును ప్లే స్కూల్లో జాయిన్ చేయాలని వెళ్లిన పేరెంట్ కి 4.3లక్షల రూపాయల ఫీజ్ డిమాండ్ చేసి షాక్ ఇచ్చింది. ఆ ఫీజుకు సంబంధించిన వివరాలతో సహా సదరు పేరెంట్ చేసిన ట్వీట్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. లక్షలు డిమాండ్ చేస్తున్న ప్లే స్కూల్ ఫీజ్ వివరాలు ఇలా ఉన్నాయి.

రిజిస్ట్రేషన్ ఫీజు ( నాన్ రిఫండబుల్ ): రూ.10,000
వార్షిక ఫీజు : రూ.25,000
టర్మ్ ఫీజు ( 4 టర్ముల చొప్పున ఒక్కొక్క టర్ముకు) : రూ.98,750

వెరసి మొత్తం ఫీజు రూ. 4,30,000 అవుతుంది. ఈ ఫీజు చూసిన నెటిజన్లు, తల్లిదండ్రులు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెడుతున్నారు.