త్వరలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి: కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్

త్వరలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి: కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్

 త్వరలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నారని  బోరబండ  కార్పొరేటర్  బాబా ఫసియుద్దీన్ అన్నారు.  ఇటీవల బీఆర్ఎస్  భవన్ లో జరిగిన కేసీఆర్ మీటింగ్ కి కార్పొరేటర్లను అనుమతించకపోవడంతో నారాజ్ లో ఉన్నారు..త్వరలోనే వీళ్లు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పారు.

గ్రేటర్ లోని 15 మంది బీఆర్ఎస్  కార్పొరేటర్లు మాతో  టచ్ లో ఉన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు.  గత తొమ్మిదేళ్లుగా స్టాండింగ్ కమిటీలో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ నుంచి ఈ సారి ఏడుగురు సభ్యులు ఉండనున్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ము లేక బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది. వచ్చే బల్దియా ఎన్నికల్లో నగర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా ఉండబోతుంది అని బాబా ఫసియుద్దీన్ అన్నారు.

 బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో  స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. స్టాండింగ్ కమిటీలో ఏడుగురు కాంగ్రెస్ కు చెందిన  కార్పొరేటర్లు, ఎంఐఎంకు చెందిన ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు.