హైదరాబాద్: పేకాట స్థావరంపై రైడ్ చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మల్కాజ్‌గిరి ఎస్ఓటి పోలీసులు. మౌలాలి, కస్తూరిబా నగర్ లో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు సిబ్బంది పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో జవహర్ నగర్ కార్పొరేషన్ 2 వ డివిజన్ కార్పొరేటర్ శివాజీ తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి రూ.1,21,520 నగదు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
