
- ప్రజావాణికి కమిషనర్ రాలేదని కార్పొరేటర్ విన్నూత నిరసన
సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి పనులకు శాంక్షన్లు ఇవ్వాలని సోమవారం బల్దియా కమిషనర్దగ్గరకు వస్తే ఆయన లేకపోవడంతో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ వినూత్న నిరసన తెలిపారు. ప్రజావాణిలో ఖాళీగా ఉన్న కమిషనర్కుర్చీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపారు. శ్రవణ్ మాట్లాడుతూ.. డెవలప్ మెంట్ పనులకు సంబంధించి సర్కిల్ ఆఫీసుకు వెళితే అక్కడ డిప్యూటీ కమిషనర్ లేరని, జోనల్ కమిషనర్ దగ్గరకు పోతే ఆయన కూడా లేకపోవడంతో నేరుగా కమిషనర్ ని కలిసేందుకు వచ్చానన్నారు. ఆయన లేకపోవడంతో కొబ్బరికాయ కొట్టి దండం పెట్టానని చెప్పారు.