మున్సిపల్ ఎన్నికలకు రూ. 1710 కోట్ల మందు

మున్సిపల్ ఎన్నికలకు రూ. 1710 కోట్ల మందు

ఎలక్షన్లలో ఆబ్కారీ శాఖకు పైసల పంట

గత ఏడాది ఎలక్షన్లతో పోలిస్తే 1,479.43 కోట్ల అదనపు ఆదాయం

ఈ మున్సిపోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1710 కోట్ల మద్యం అమ్మకాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వరుస ఎన్నికల పుణ్యమాని ఎక్సైజ్‌ శాఖకు మస్తు ఆదాయమొచ్చింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ, పంచా యతీ, పార్లమెంట్‌, పరిషత్‌ ఎలక్షన్ల‌తో పాటు మొన్న జరిగిన మున్సిపోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆబ్కారీ శాఖ 9,458 కోట్ల మద్యం అమ్మింది. కేవలం ఈ మున్సిపల్ ఎన్నికల్లోనే ఎక్సైజ్ శాఖ రూ.1710 కోట్ల మందు అమ్మింది. అసెంబ్లీ, పంచాయతీ ఎలక్షనల్లో.. 201 8 నవంబర్, డిసెంబర్‌లో అసెంబ్లీ, 2019 జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. జీపీ ఎలక్షన్లు మూడు విడతలుగా జరగ్గా ఆ మూడు నెలల్లో 5,459 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2017లోని ఇదే మూడు నెలల్లో 4,558 కోట్లు మాత్రమే అమ్ముడు పోయింది. అంటే సుమారు రూ.901 కోట్ల సేల్స్ పెరిగాయి. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పరిషత్‌ ఎన్నికల్లో .. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు 2019ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకటి నుంచి మే 13 వరకు జరగ్గా 2,289.85 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2017లో ఇదే సమయంలో 1,981.42 కోట్ల మద్యం అమ్ముడైంది. ఈ లెక్కన 308.43 కోట్లు అదనపు ఆదాయం వచ్చింది.మున్సిపోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..ఈ నెల ఒకటో తేదీ నుంచి 24వ తేదీ వరకు 1710 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇదే సమయానికి గత సంవత్సరం మాత్రం 1440 కోట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. రూ.270 కోట్లు అదనంగా జరిగాయి. చలికాలం ‘హాట్’ హాట్ గా… ఇది చలికాలం కావడంతో చాలా మంది బీర్ల కంటే ఎక్కువగా ‘హాట్’ కే ఓటేశారు. ఈ సీజన్లో 25,58,202 కేసుల ఐఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అమ్ము డుపోగా 25,17,392 కేసుల బీ ర్లు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే బీర్ల కంటే లిక్కర్ ఎక్కువగా తాగారు.