కాటన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

కాటన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని కాటన్ గోదాంలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో 13 కోట్ల విలువైన పత్తి కాలిపోయింది. కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో బాలాజీ రూరల్ వేర్ హౌసెస్ లోని  పత్తి బెల్స్ మంటల్లో కాలిపోయాయి. గోదాంలో 20 కోట్ల విలువైన పత్తి నిల్వలు ఉన్నాయి. అందులో 13  కోట్ల విలువైన పత్తి బూడిదైనట్లు గుర్తించింది గోదాం యజమాన్యం. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పరిశీలిస్తున్నారు అధికారులు.