వరంగల్ మార్కెట్ లో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు

వరంగల్ మార్కెట్ లో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. పెండింగ్ బకాయిల కోసం వ్యాపారులు ఆందోళన చేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున 4,5 గంటలకు పత్తి లోడ్ లతో యార్డులకు వచ్చిన రైతులు వ్యాపారుల ఆందోళనలతో పడిగాపులు కాస్తున్నారు. నాగేంద్ర  ట్రేడింగ్ కంపెనీ నుంచి రావలసిన బకాయిలు ఇప్పించే వరకు  కొనుగోళ్లు ప్రారంభించేది లేదని వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. రైతుల నుంచి కమిషన్ ఏజెంట్లు పత్తి కొంటే.... ఏజెంట్ల నుంచి ఖరీదు దారులు కాటన్ కొనుగోలు చేస్తారు. మొత్తం 10 కోట్లకు పైగా బకాయిలు రావాలని చెప్తున్నారు వ్యాపారులు. మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు  ఇబ్బందులు పడుతున్నారు. పత్తి సీజన్ కావడంతో పెద్ద సంఖ్యలో వాహనాల్లో పంటను తీసుకొస్తున్నారు రైతులు. అటు మార్కెట్లలో ఇప్పటికే వచ్చిన పత్తి ఎప్పుడు కొంటారో తెలియక అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు.