శాసన మండలి రిపేర్లు త్వరగా పూర్తి చేయాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి

శాసన మండలి రిపేర్లు త్వరగా పూర్తి చేయాలి : గుత్తా సుఖేందర్  రెడ్డి
  • ఆగాఖాన్ ట్రస్ట్, అధికారులకు చైర్మన్ గుత్తా ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి బిల్డింగ్ మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను కౌన్సిల్ చైర్మన్  గుత్తా సుఖేందర్  రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి  డిప్యూటీ చైర్మన్  బండా ప్రకాశ్ ముదిరాజ్, సెక్రటరీ నరసింహాచార్యులతో కలిసి రిపేరు పనులను చైర్మన్  పరిశీలించారు. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులు, అగాఖాన్  సంస్థ ప్రతినిధులతో అసెంబ్లీ స్పీకర్ చాంబర్ లో సమీక్ష  నిర్వహించారు.