- రవీంద్రభారతిలో అధికారంగా రోశయ్య వర్ధంతి సభ
బషీర్బాగ్, వెలుగు: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య జీవితం యువ రాజకీయ నాయకులకు మార్గదర్శమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. రవీంద్రభారతిలో గురువారం రోశయ్య 4వ వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రమశిక్షణకు మారుపేరు రోశయ్య అని తెలిపారు. నిండు తెలుగుదనానికి ప్రతిరూపం రోశయ్య అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. నూతన శాసన సభ్యులకు రోశయ్య ప్రసంగాలు ఒక పుస్తకం వంటిదన్నారు.
ఏపీ పాలకులు సిగ్గుపడాలి: ఆమంచి
ఏపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి శ్రీనివాస్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డిని చూసి ఆంధ్ర పాలకులు సిగ్గుపడలని విమర్శించారు. ఆంధ్రలో కుల తత్వం రాజ్యమేలుతున్నందునే రోశయ్యకు తగిన గౌరవం దక్కలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు.
