నమ్మించాడు.. చిట్టచివరికి నట్టేట ముంచాడు: కౌన్సిలర్లు

నమ్మించాడు.. చిట్టచివరికి నట్టేట ముంచాడు:  కౌన్సిలర్లు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలంలోని తూంకుంట పురపాలక సంఘం పరిధిలో కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు అవిశ్వాస  బల పరీక్షకు ఈ రోజు(ఫిబ్రవరి 22) తేదీ కేటాయించారు. దీంట్లో 1 వార్డు కౌన్సిలర్ పూజ భరత్ సింగ్ కనిపించడం లేదంటూ దొంగలు, దొంగలు అంటూ ప్లకార్డులు ప్రదర్శన చేశారు. నమ్మించాడు నట్టేట ముంచాడంటూ.. తోటి వార్డు కౌన్సిలర్లు చావు డప్పు మోగిస్తూ తుంకుంట మున్సిపాలిటీ పురవీధుల్లో పూజ భరత్ సింగ్ ఫోటోలతో ఊరేగింపు నిర్వహించారు.

బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మొగ్గు చూపితే కాంగ్రెస్ ఇద్దరు సభ్యులు సైతం వారికి మద్దతు పలికారు. తీరా అవిశ్వాస తీర్మానం రోజున తీర్మానంపై సంతకం చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వ్యతిరేకంగా తిరగడంతో అవిశ్వాసానికి ముందుకొచ్చిన వార్డు కౌన్సిలర్లు కంగుతిన్నారు. తమను నమ్మించి మోసం చేశాడంటూ మొదటివాడు వార్డు కౌన్సిలర్ పూజా భరత్ సింగ్ ఫోటోలను ఊరేగింపు నిర్వహిస్తూ.. చావు డప్పు మోగించారు.

ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన వార్డు కౌన్సిలర్లు మాట్లాడుతూ.. అవిశ్వాసానికి పురుగున కౌన్సిలర్ పూజ భరత్ సింగ్ ఇంట్లో ఉన్న వాళ్లందర్నీ బయటకు లాగి అవిశ్వాసం పేరుతో డబ్బులు దండుకొని మోసం చేశాడని ఆరోపించారు. తూముకుంట మున్సిపాలిటీలోని నాలుగో వార్డ్ కౌన్సిలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.