గుడ్ న్యూస్.. వీసా లేకుండానే ఇక మలేషియా వెళ్లొచ్చట..

గుడ్ న్యూస్.. వీసా లేకుండానే ఇక మలేషియా వెళ్లొచ్చట..

భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు ఇప్పుడు వీసా అవసరం లేకుండానే 25 దేశాలకు ప్రయాణించవచ్చు. ఈ దేశాలు భారతీయులకు వీసా లేకుండానే ప్రవేశాన్ని అందిస్తున్నాయి. వీటిలో చాలా దేశాలు ఆసియా, ఆఫ్రికాలో ఉన్నాయి. ఇందులో కొన్ని ద్వీప దేశాలు కూడా ఉన్నాయి. భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అందించే దేశాల జాబితాలో ఇటీవలే థాయిలాండ్, శ్రీలంక వచ్చి చేరాయి. తాజా సమాచారం ప్రకారం ఈ జాబితాలోకి మలేషియా కూడా చేరనుంది. డిసెంబర్ 1న ఈ లిస్ట్ లో మలేషియా కూడా చేరనున్నట్టు నిర్ణయించుకుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. పర్యాటక పరిశ్రమను మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ 25 దేశాలు భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించగా, బస వ్యవధిపై పలు ఆంక్షలు విధిస్తారు. అయితే, జమైకా, నేపాల్, పాలస్తీనా భూభాగాల్లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు.

భారతీయ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్

199 దేశాలలో హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023లో భారతదేశం 80వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంది.

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో టాప్ 10 దేశాలు:

  1.     సింగపూర్
  2.     జపాన్
  3.     ఫిన్లాండ్
  4.     ఫ్రాన్స్
  5.     జర్మనీ
  6.     ఇటలీ
  7.     దక్షిణ కొరియా
  8.     స్పెయిన్
  9.     స్వీడన్
  10.     ఆస్ట్రియా