అప్సర కేసు: రెండు రోజుల కస్టడీకి నిందితుడు సాయికృష్ణ

అప్సర కేసు: రెండు రోజుల కస్టడీకి నిందితుడు సాయికృష్ణ

శంషాబాద్  సంచలనం సృష్టించిన  అప్సర హత్య కేసు నిందితుడు పూజారి వెంకట్ సూర్య సాయి కృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.  హత్య కేసు ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ నుండి శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు బదలాయించారు.   హత్య కేసు రీ కన్ స్ట్రక్షన్   కోసం  శంషాబాద్ పోలీసులు కస్టడీ కోరగా.. రెండు రోజులు కష్టడికి అనుమతించింది కోర్టు.

జూన్ 3న అప్సరను శంషాబాద్ లో హత్య చేసిన సాయికృష్ణ కారులో డెడ్ బాడీని సరూర్ నగర్ లో డంప్ చేశాడు. అక్కడ  ఓ మ్యాన్ హోల్ లో  పడేశాడు. ఈ విషయం బయటపడకుండా మ్యాన్ హోల్ కు కాంక్రీట్ వేశాడు.నిందితుడు సాయికృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు..అప్సర భౌతిక దేహాన్ని మ్యాన్ హోల్ నుంచి బయటకు తీశారు.  అప్సరకు ట్యాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి దించి ఆ తర్వాత బండరాయితో మోది చంపినట్లు విచారణలో వెల్లడయింది. ఈ కేసులో నిందితుడు సాయికృష్ణకు కోర్టు 134 రోజుల రిమాండ్ విధించింది.  దీంతోసాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. అప్సరకు సాయికృష్ణతో ఎఫైర్ కంటే ముందే పెళ్లి జరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శంషాబాద్