ఢిల్లీ లిక్కర్ స్కాం..సీబీఐ చార్జ్ షీట్​ను పరిగణలోకి తీసుకున్న కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం..సీబీఐ చార్జ్ షీట్​ను పరిగణలోకి తీసుకున్న కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన10 వేల పేజీల చార్జ్ షీట్ ను సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగులతో పాటు మొత్తం ఏడుగురి పేర్లను చేర్చుతూ నవంబర్ 25న సీబీఐ అధికారులు ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ స్కాంలో తెలంగాణకు చెందిన బిజినెస్ మ్యాన్ బోయినపల్లి అభిషేక్ రావు, ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జి విజయ్ నాయర్, ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, రాబిన్ డిస్టిలరీస్ ఎల్ఎల్పీకి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఇండియా ఎహెడ్ అధినేత ముత్తా గౌతమ్, ఢిల్లీ ఆబ్కారీ శాఖ మాజీ అధికారులు కుల్ దీప్ సింగ్, నరేందర్ సింగ్ లను సీబీఐ నిందితులుగా చేర్చింది.

అయితే, ఇన్ని రోజులు ఈ చార్జ్ షీట్ పై నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టిన ధర్మాసనం గురువారం దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అలాగే, ఈ కేసు తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. నిందితుల్ని ఆ రోజు తమ ముందు హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది.