కరోనా వైరస్ మళ్లీ వస్తోంది. గతంలో వచ్చిన వేరియింట్ల కంటే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరంగా ఉండబోతుంది. 2019లో వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని పొట్టన పెట్టుకుంది. అయితే త్వరలో రాబోయే కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య ఊహించలేనంతగా ఉండనుందట. ఈ విషయాన్ని చైనా వైరాలజిస్ట్ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే..
చైనీస్ వైరాలజిస్ట్ షి జెంగ్లీ. ఈమె జంతువుల నుంచి ఉద్భవించే వైరస్‌లపై విస్తృత పరిశోధన చేసింది. దీంతో షి జెంగ్లీని బాట్‌వుమన్ అని పిలుస్తుంటారు. అయితే షి జెంగ్లీ భవిష్యత్తులో భయంకరమైన కరోనావైరస్ ఉద్భవించే అవకాశం ఉందంటూ బాంబు పేల్చింది. ఈ వైరస్ వ్యాప్తి ఎప్పుడైనా జరగవచ్చని వెల్లడించింది.
Also Read :- తగ్గిన బంగారం, వెండి ధరలు
ఉహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన షి జెంగ్లీ..తన సహచర శాస్త్రవేత్తల టీమ్  40 కరోనావైరస్  జాతులపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో భయంకరమైన ఫలితాలు వెలువడ్డాయి.   40 కరోనావైరస్  జాతుల్లో సగానికి పైగా వైరస్‌లు..అత్యంత ప్రమాదకరమైనవిగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీటిలో ఇప్పటికే ఆరు వైరస్ లు  మానవులకు సోకాయని తెలిపారు. మరో  మూడు  వైరస్ లు ఇతర జంతు జాతులకు సోకినట్లు  అధ్యయనంలో చెప్పారు.  అయితే భవిష్యత్తు మరో కరోనా లాంటి వ్యాధి ఆవిర్భావం  ఖచ్చితంగా ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు.  ఈ వ్యాధి 
కరోనా కంటే ఏడు రెట్లు ఎక్కువ డేంజర్ అని..ఈ వైరస్ వల్ల కోట్లలో మందిని బలి తీసుకునే అవకాశం హెచ్చరించారు. 
 
