యూకేలో మళ్లీ కరోనా పంజా : ఊహించని విధంగా పెరుగుతున్న కేసులు

యూకేలో మళ్లీ కరోనా పంజా : ఊహించని విధంగా పెరుగుతున్న కేసులు

యునైటెడ్​కింగ్ డమ్ (యూకే)లో కొవిడ్ 19 కేసులు విజృంభిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రికార్డు స్థాయిలో కేసుల పెరుగుదల అక్కడి వైద్యారోగ్యశాఖలో గుబులు పుట్టిస్తోంది. శీతాకాలం సమీపిస్తుండడంతో యునైటెడ్​కింగ్ డమ్లోని ఆరోగ్యశాఖ అధికారులు కొవిడ్ 19 మరొక వేవ్కు సిద్ధం కావాలని ఆ దేశ పౌరులకు హెచ్చరిక జారీ చేశారు. యూకేలో ప్రస్తుతం కొవిడ్​ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది ప్రధానంగా SARS-CoV-2  వైరస్​ కారణంగా చెప్పవచ్చు. ఈ కేసుల పునరుజ్జీవం అనేది కొత్త రూపాంతరం ఆవిర్భావానికి దారి తీయెచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీన్ని   BA.2.86గా గుర్తించారు. దీన్ని అధికారికంగా పిరోలా వేరియంట్గా సూచిస్తారు. 

కొవిడ్తో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతోంది. అసలే శీతాకాలం ప్రారంభంకావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు, సూచనలు చేస్తున్నారు అక్కడి డాక్టర్లు. ఈ కేసుల పెరుగుదల కొత్త వైరస్​ రూపాంతరం ఆవిర్భావంతో ముడిపడి ఉందని చెబుతున్నారు. అక్టోబర్ 6వ తేదీ నాటికి ఇంగ్లండ్‌లో 3 వేల366 మంది ఈ వైరస్​ బారిన పడ్డారు.

వింటర్ సీజన్ వచ్చే ప్లూ వంటి వ్యాధులతో పాటు మరిన్ని ఇతర కేసులు పెరుగుతాయని యూకే హెల్త్​ సెక్యూరిటీ ఏజెన్సీ చెబుతోంది. కొవిడ్​ తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లతో ఇతరులు చాలా జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత వరకు వారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ మేరీ రామ్‌సే. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) తాజా నివేదక ప్రకారం... ఇంగ్లండ్‌లో ప్రస్తుతం ప్రతిరోజూ సగటున 2 వేల 257 కొత్త కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.