ఈ నెలాఖరులో అందుబాటులోకి నాసల్ వ్యాక్సిన్

ఈ నెలాఖరులో అందుబాటులోకి నాసల్ వ్యాక్సిన్

ఈ నెల చివరి వారంలో నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. నాసల్ టీకాను 18 ఏళ్లు నిండిన వారు బూస్టర్ డోస్ గా, అత్యవసర పరిస్థితుల్లో తీసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. కోవిన్ పోర్టల్ ద్వారా బూస్టర్ డోసు స్లాట్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో సింగిల్ డోస్ 800గా నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్ ధర 325గా నిర్ణయించింది. 

‘ఇన్ కో వాక్’ బూస్టర్ డోస్ మన దేశంలో తయారైన మొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. ఇప్పటివరకు 3 దశల్లో సక్సెస్​ఫుల్​గా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ టీకాను డాక్టర్, సూదితో పనిలేకుండా ఎవరైనా ఎప్పుడైనా ముక్కులోంచి స్ర్పే చేసుకునేలా భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది. ఇది కరోనా వైరస్​ను అడ్డుకోవడంతో పాటు, వైరస్ వ్యాప్తి జరగకుండా కాపాడుతుందని కంపెనీ తెలిపింది. రెండు డోసులు వేసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోసుగా నాసల్ వ్యాక్సిన్ వినియోగించనున్నారు.