కరోనాను కేంద్రం లైట్ తీసుకుంటోంది

కరోనాను కేంద్రం లైట్ తీసుకుంటోంది

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే పలుమార్లు కామెంట్ చేసిన రాహుల్.. మరోమారు ఈ విషయంపై వ్యాఖ్యలు చేశారు. కరోనాపై కేంద్ర సర్కార్‌‌ది అతి విశ్వాసమని మండిపడ్డారు. మహమ్మారి వల్ల నెలకొన్న పరిస్థితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోందన్నారు. ఏమీ కాదులే అని లైట్ తీసుకుంటోందని, వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గలేదని స్పష్టం చేశారు. సౌతాఫ్రికాతోపాటు బ్రెజిల్‌కు చెందిన కొత్త కరోనా వేరియంట్లు భారత్‌‌లోకి ప్రవేశించాయన్న వార్తల నేపథ్యంలో రాహుల్ పైవ్యాఖ్యలు చేశారు. అంగోలా, టాంజానియా నుంచి భారత్‌‌కు వచ్చిన వారిలో ఇద్దరికీ, అలాగే సౌతాఫ్రికా నుంచి వచ్చిన వారిలో ఇద్దరు వ్యక్తుల్లో కొత్త కరోనా వేరియంట్‌‌ను గుర్తించామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు.