16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్

16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సినేషన్‌‌లో హెల్త్‌‌కేర్ వర్కర్‌‌లు, ఫ్రంట్‌‌లైన్ వర్కర్‌‌లకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పింది. అలాగే 50 ఏళ్లు పైబడిన వారికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తామని స్పష్టం చేసింది. ‘వ్యాక్సినేషన్ ప్రక్రియలో సుమారు 3 కోట్ల సంఖ్య ఉన్న హెల్త్‌‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌‌లైన్ వర్కర్స్‌‌‌కు తొలుత ప్రాధాన్యం ఇస్తాం. ఆ తర్వాత 50 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు, అనంతరం యాభై ఏళ్లలోపు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తాం. వీరి సంఖ్య దాదాపుగా 27 కోట్లు ఉంటుంది’ అని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.