క్రేజీ కొవిడ్ బ్యాండ్స్​.. ఇదే కొత్త ట్రెండ్ 

క్రేజీ కొవిడ్ బ్యాండ్స్​.. ఇదే కొత్త ట్రెండ్ 

కొవిడ్ బ్యాండ్స్ కొత్త ట్రెండ్‌గా మారాయి. ఫ్రెండ్​షిప్​ బ్యాండ్​లానే కొవిడ్​ బ్యాండ్స్ కూడా. కాకపోతే ఇవి ఫ్రెండ్స్​కే కాదు ఎవరికైనా ఇవ్వొచ్చు. ఇవి రంగురంగులుగా ఉంటాయి. వీటిమీద ఒక మెసేజ్ కూడా ఉంటుంది. రెడ్ – నో కాంటాక్ట్​, ఎల్లో –​ ఎల్బో ఓన్లీ, గ్రీన్​ అంటే హైఫై, హ్యాండ్​షేక్​లని అర్థం. ఇవే కాదు ఇంకా ఇలాంటి బ్యాండ్స్​ చాలా మార్కెట్​లోకి వచ్చాయి. వ్యాక్సిన్​ అవేర్​నెస్​ బ్యాండ్స్​ కూడా వచ్చాయి. కొన్ని కంపెనీలు వీటిని ప్రమోట్​ చేస్తున్నాయి. ఇంకా సోషల్ డిస్టెన్స్​, ట్రస్ట్​ గాడ్, స్టే స్ట్రాంగ్, ఐహ్యావ్​ వ్యాక్సినేటెడ్ వంటి రకరకాల బ్యాండ్​లు మార్కెట్​లో హల్‌చల్ చేస్తున్నాయి.