ఇష్టారాజ్యంగా కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులు

ఇష్టారాజ్యంగా కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులు

కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతుండటంతో పాటు.. ఫైర్ సేఫ్టీ అనుమతులు లేని కోవిడ్ సెంటర్ల అనుమతులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనతో ప్రైవేట్ కోవిడ్ సెంటర్లలో సౌకర్యాలను పరిశీలించాలని సీఎం సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలో ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చిన అధికారుల అవినీతి బయటపడుతుంది. కృష్ణాజిల్లా డి.ఎం.హెచ్.ఓ కోవిడ్ సెంటర్లలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతుల విషయంలో భారీగా చేతివాటం చూపించారని అనుమానాలు వస్తున్నాయి. స్వర్ణప్యాలెస్ ఘటనకు ఇదే ప్రధాన కారణమని సమాచారం. ఫైర్ సేఫ్టీ అనుమతులు సక్రమంగా లేకపోవడంతో పాటు.. నిబంధనలు అతిక్రమించిన మరికొన్ని కోవిడ్ సెంటర్ల అనుమతులను తాజాగా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇంద్రప్రస్థ హోటల్ లోని ఎలైట్ అడ్వాన్స్ కోవిడ్ 19 సెంటర్, రామవరప్పాడులోని సాయి మాధవి హాస్పిటల్, చుట్టు గుంటలోని అనిల్ న్యూరో అండ్ ట్రామ సెంటర్, బందరు రోడ్డులోని శశి ప్యారడైజ్ హోటల్ లోని బీ.ఎన్. శ్రీరామ్ హాస్పిటల్ అనుమతులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

For More News..

జనం చేతికి అందకుండానే ‘డబుల్’ ఇండ్లు పెచ్చులూడుతున్నయ్

నాలాలపైనే లీడర్ల ఇండ్లు!

సర్కారు స్కూళ్లు షురూ..