కరోనా ముప్పు ఇంకా పోలేదు..అప్రమత్తంగా ఉండండి..

కరోనా ముప్పు ఇంకా పోలేదు..అప్రమత్తంగా ఉండండి..

కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాల వెళ్లే పిల్లలకు టీకాల వేయడంతో పాటు వృద్ధులకు ప్రికాషనరీ డోస్ వేయాలని సూచించారు. దీంతో పాటు జోనోమ్ సీక్వెన్సింగ్ ను బలోపేతం చేయాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండడం ముఖ్యమన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్ మెంట్ తో  పాటు టీకాలు వేయడం కోవిడ్ నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన హర్ ఘర్ దస్తక్ 2.0 ప్రత్యేక డ్రైవ్ ను సమీక్షించాలని అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులను ఆదేశించారు.  

12 నుంచి 17 ఏళ్ల పిల్లలకు రెండు డోసుల టీకాలు వేసేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని మన్సుఖ్ మాండవీయ అన్నారు. టీకా రక్షణతో పిల్లలు పాఠశాలలకు హాజరుకావొచ్చని చెప్పారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా 8వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రి రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.