ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ..
  • ప్రాణాలు కోల్పోతున్న వేలాది మంది
  • కొత్త కేసుల్లో 40 శాతం అమెరికాలోనే 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజుకు 20 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 23 లక్షల 53 వేల 411 మందికి వైరస్ సోకింది. మరో 5 వేల 605 మంది ప్రాణాలు కోల్పోయారు. నమోదవుతున్న కేసుల్లో దాదాపు 40 శాతం కేసులు ఒక్క అమెరికాలోనే నమోదవుతున్నాయని అధికారులు ప్రకటించారు.
అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది.

రోజుకు దాదాపు 8 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. హెల్త్ సిబ్బందికి కరోనా సోకుతుండటంతో అక్కడ ఆరోగ్యవసతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. సమస్యలను పరిష్కరించేందుకు ఆర్మీ వైద్యులను రంగంలోకి దించుతోంది బైడెన్ సర్కార్.. ఇక ఫ్రాన్స్ లోనూ ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే ఫ్రాన్స్ లో 3 లక్షలకు పైగా కేసులొచ్చాయి. ఇటలీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, టర్కీలో రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. 
కరోనా మహమ్మారిని తట్టుకొని మనిషి మనుగడ సాగించే స్థితికి అమెరికా వెళ్తోందని ఆ దేశ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి తెలిపారు. కొత్తగా పుట్టుకొస్తున్న మ్యుటేషన్లు వ్యాక్సిన్ తీసుకొని వ్యక్తుల కారణంగా కరోనా వైరస్ సమూల నిర్మూలన అసాధ్యమని వెల్లడించారు. 

 

ఇవి కూడా చదవండి: 

భారత్లో కరోనా విజృంభణ.. కొత్తగా 2.7 లక్షల కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1963 కరోనా కేసులు, ఇద్దరు మృతి