జూలైలో సెకండ్ వేవ్ ఖతం

జూలైలో సెకండ్ వేవ్ ఖతం
  •  మరో ఆరు నెలల తర్వాత థర్డ్ వేవ్

న్యూఢిల్లీ: దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ప్రభావం జూలైలో పూర్తిగా ముగుస్తుందని కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ తెలిపింది. మూడో వేవ్ మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో వచ్చే అవకాశం ఉందని ముగ్గురు శాస్త్రవేత్తలతో కలిపి సైన్స్ మినిస్ట్రీ ఏర్పాటు చేసిన ప్యానెల్ పేర్కొంది. సూత్రా (సస్పెక్టబుల్, అన్ డిటెక్టెడ్, టెస్టెడ్ (పాజిటివ్), రిమూవ్డ్ అప్రోచ్) మోడల్ ను ఆధారంగా చేసుకొని ప్యానెల్ దీన్ని అంచనా వేసింది. దీని ప్రకారం.. మే నెలాఖరుకు దేశంలో నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలకు పడిపోతుందని ప్యానెల్ స్పష్టం చేసింది. జూన్ లో రోజుకు 20 వేల లోపే కేసులు నమోదవుతాయని తెలిపింది. ఎక్కువ మంది ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తాం కాబట్టి థర్డ్ వేవ్ వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చని సైంటిస్టులు చెప్పారు. అక్టోబర్ నెల వరకు మూడో వేవ్ రాదని క్లారిటీ ఇచ్చారు.