చెత్త బండిలో కరోనా వ్యాక్సిన్ల​ తరలింపు

V6 Velugu Posted on Sep 19, 2021

దుండిగల్​ మున్సిపాలిటీకి చెందిన చెత్త తరలించే వాహనంలో అధికారులు కొవిడ్ ​వ్యాక్సిన్లను తరలించగా తీవ్ర విమర్శలు వచ్చాయి. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని  బౌరంపేటలోని ఓ కేంద్రానికి వ్యాక్సిన్లను చెత్త వాహనంలో తీసుకెళ్లి దించారు. దీంతో ప్రజారోగ్యంపై అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని స్థానికులు మండిపడ్డారు. అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని, ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దని అన్నారు.  ‌‌‌‌‌‌‌‌
 

Tagged Covid vaccine, garbage truck, Dundigal municipality, Evacuate.

Latest Videos

Subscribe Now

More News