కరోనా వ్యాక్సిన్ల బహిరంగ అమ్మకానికి డీసీజీఐ అమోదం

కరోనా వ్యాక్సిన్ల బహిరంగ అమ్మకానికి డీసీజీఐ అమోదం

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు. కరోనాను కంట్రోల్ చేయడానికి వివిధ కంపెనీలు కష్టపడి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ వ్యాక్సిన్లతో ఇమ్యూనిటి పెరుగుతుండటంతో వాటికి డిమాండ్ పెరిగింది. కాగా.. ఇప్పటివరకు కేవలం పరిమితంగా లభించిన వ్యాక్సిన్లను.. బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. ఈ క్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఆస్పత్రులు, క్లినిక్‎ల నుంచి కొనుగోలు చేసే వెసులుబాటు లభించింది. అయితే ఈ వ్యాక్సిన్లు మెడికల్ దుకాణాలలో మాత్రం అందుబాటులో ఉండవని డీసీజీఐ చెప్పింది.

కాగా.. ఆసుపత్రులు మరియు క్లినిక్‌లు వ్యాక్సిన్‌లను కొనుగోలు చేసి.. ప్రజలకు అమ్ముకోవచ్చు. అయితే ఈ అమ్మకాలకు సంబంధించిన డేటా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీసీజీఐకి సమర్పించాలి. ఈ డేటా కోవిన్ యాప్‌లో కూడా అప్‌డేట్ చేయబడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

For More News..

భారత దిగ్గజ హాకీ ప్లేయర్ చరణ్‌జిత్ సింగ్ కన్నుమూత

సక్సెస్‎ఫుల్ వీర్యదాత.. 138 మందికి దానం