రూ. 225 రూపాయలకే సీరమ్ ఇండియా క‌రోనా వ్యాక్సిన్

రూ. 225 రూపాయలకే  సీరమ్ ఇండియా క‌రోనా వ్యాక్సిన్

రూ.225కే క‌రోనా వ్యాక్సిన్ ను అంద‌జేయ‌నున్న‌ట్లు సీరమ్ ఇండియా ప్ర‌క‌టించింది.

ప్ర‌పంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరమ్ ఇండియా ,ఆక్స్ ప‌ర్డ్ యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్యం క‌రోనా వ్యాక్సిన్ పై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

ప‌రిశోధ‌న‌ల్లో భాగంగా రెండో, మూడో ద‌శ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ చేసుకోవ‌చ్చంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్. యూకేలో ఈ వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా.. బ్రెజిల్‌లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో తొలి, రెండో దశలో మనుషులపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌మ వ్యాక్సిన్ ను రూ.225కే అందిస్తున్న‌ట్లు సీర‌మ్ ఇండియా ప్ర‌క‌టించింది. ఈ వ్యాక్సిన్ ను 92 దేశాల‌కు అందించేందుకు సుమారు 100 మిలియ‌న్ల వ్యాక్సిన్ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపింది.

కోవిషీల్డ్ ప‌నితీరు భాగుంది

సీరమ్ ఇండియా – ఆక్స్ ఫర్డ్ యూనివ‌ర్సిటీ త‌యారు చేస్తున్న క‌రోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ లో మంచి ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ట్లు ప్ర‌ముఖ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ ది లాన్సెట్ తెలిపింది. క‌రోనా వైర‌స్ ను త‌ట్టుకునేలా ఇమ్యూనిటీ పవ‌ర్ త‌యార‌వుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.