
గచ్చిబౌలి, వెలుగు : సివిల్ స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి సూచించారు. బుధవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్పరేడ్గ్రౌండ్లో ట్రైనింగ్ ప్రొగ్రాంకు సైబరాబాద్ సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ అవినాశ్ మహంతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట పోలీసులకు బెస్ట్ పోలీస్‌గా దేశంలో మంచి పేరుందన్నారు.
ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్న స్టైఫండరీ క్యాడెట్ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు. ట్రైనింగ్ సమయంలో ఇండోర్, అవుట్‌డోర్ ట్రైనింగ్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, సీటీసీ డీసీపీ ప్రిన్సిపల్ ఎల్సీ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.