కీసరగుట్ట బ్రహ్మోత్సవాలపై రాచకొండ సీపీ

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలపై రాచకొండ సీపీ

మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామిని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ దర్శించుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయ మండపంలో ఆలయ చైర్మన్ తాటకం రమేష్ శర్మ స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక ఈ నెల 16 నుండి 21వ తేదీ వరకు జరిగే కీసర బ్రహ్మోత్సవాలపై ఆలయ చైర్మన్‭తో చర్చించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లను పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందుగా ఏర్పాటు చేసిన.. ట్రాఫిక్ రూట్ మ్యాప్ను సీపీ పరిశీలించారు. మిగిలిన ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో కలియతిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని సీపీ చౌహాన్ అన్నారు. గతేడాది కరోనా కారణంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో రాలేదని ఈసారి పూర్తిస్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు. అలాగే..  వెహికిల్ పాసులు చాలా వరకు తగ్గించే విధంగా చూస్తామని సీపీ చౌహాన్ వెల్లడించారు.