- హెచ్ ఫాస్ట్ పనితీరును అభినందించిన సీపీ సజ్జనర్
బేగంబజార్, వెలుగు: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. సోమవారం బేగం బజార్లోని హెచ్-ఫాస్ట్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి, పనితీరును సమీక్షించారు.
ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు హెచ్-ఫాస్ట్ బృందాలు 117 కేసులు నమోదు చేసి, సుమారు 129.34 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తక్కువ కాలంలోనే ఈ విభాగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన 108 మంది సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

