హైదరాబాద్: సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్ర మాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు చనిపో వడం బాధాకరమన్నారు. ప్రమాదంలో జరిగిన బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు చెందినవారు మరణించారని తెలిపారు. ఈ నెల 9న 54 మందియాత్రికులు హైదరాబాద్ నుంచి మక్కాకు వెళ్లారని తెలిపారు. వారిలో నలుగురు మక్కా లోనే ఉండిపోగా.. మరో నలుగురు కారులో మదీనాకు వెళ్లారని పేర్కొన్నారు. మిగతా 46 మంది బస్సులో మదీనాకు బయల్దేరగా.. అక్క డికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఈ ఘోరం జరిగిందన్నారు.
ఈనెల 23వ తేదీ వరకూ ట్రావెల్ ప్లాన్ ఉందని, అంతలోనే ఈ దుర్ఘటనజరిగిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమా దంలో 45 మంది చనిపోయారని ప్రకటించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రయాణికుల్లో మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయపడ్డారని తెలిపారు.సౌదీ హజ్ యాత్రకు వెల్లి బస్సు ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. విద్యానగర్ కు చెందిన ఎస్ కే నసీరుద్దీన్ కుటుంబ సభ్యులు ఉండటంతో వారి ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాదీలు
- రషీమున్నీసా
- రహత్ బీ
- షేహనాబా్ బేగం
- గౌసియా బేగం
- కదీర్ మహ్మద్
- మహ్మద్ మౌలానా
- షోయబ్ మహ్మద్
- సోహైల్ మహ్మద్
- మస్తాన్ మహ్మద్
- పర్వీన్ బేగం
- జకియా బేగం
- షాకత్ బేగం
- ఫర్హీన్ బేగం
- జహీన్ బేగం
- మహ్మద్ మంజూర్
- మహ్మద్ అలీ
