లైసెన్స్ డ్ తుపాకులను పీఎస్లలో అప్పగించాలి : సీపీ విజయ్ కుమార్

లైసెన్స్ డ్ తుపాకులను పీఎస్లలో అప్పగించాలి : సీపీ విజయ్ కుమార్
  •     సీపీ విజయ్ కుమార్

సిద్దిపేట రూరల్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్స్ తుపాకులను స్థానిక పీఎస్​లలో అప్పగించాలని సీపీ  విజయ్ కుమార్ అన్నారు. తుపాకులు కలిగి ఉన్న వ్యక్తులు ఈ నెల 29 లోపు అప్పగించాలని సూచించారు. 

లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి తీసుకొని వెళ్లవచ్చన్నారు. జిల్లాలోని సరిహద్దు పీఎస్ లలో 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24 గంటలు వాహనాల తనిఖీ చెస్తున్నట్లు వెల్లడించారు.