8 గంటల పని హక్కును మార్చడం దుర్మార్గం : కూనంనేని

8 గంటల పని హక్కును మార్చడం దుర్మార్గం : కూనంనేని
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఫైర్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని వాణిజ్య ప్రదేశాలలో ఉద్యోగులు, కార్మికులతో రోజుకు 10 గంటలపాటు పని చేయించేలా యాజమాన్యానికి వీలు కల్పిస్తూ జారీ చేసిన జీవో 282ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులకు ఈ జీవో భంగం కలిగిస్తున్నదని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన జాతీయ సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ శ్రేణులు ఆ సమ్మెకు మద్దతుగా నిలవాలని కోరారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటనపై సమగ్రమైన విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్​ చేశారు.