బస్తీల అభివృద్ధి సీపీఐతోనే సాధ్యం : సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

బస్తీల అభివృద్ధి సీపీఐతోనే సాధ్యం :  సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

పాల్వంచ, వెలుగు : పేదల కష్టాలు తీర్చేది ఎర్ర జెండాయేనని, బస్తీల అభివృద్ధి సీపీఐతోనే సాధ్యమని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యద ర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీనివాస బంజారా కాలనీకి చెందిన 167 కుటుంబాలు సీపీఐలో చేరాయి. పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే పార్టీ జనాదరణ పొందుతుందన్నారు. 

పాల్వంచలో అభివృద్ధి జరగాలంటే సీపీఐ కార్పొరేటర్లతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం, సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు అడుసుమల్లి సాయిబాబా, వీసం శెట్టి పూర్ణ, ఉప్పుశెట్టి రాహుల్, పద్మజ, డి.సుధాకర్, ఈ.వెంకట్రావు, ఎస్.శ్రీనివాసరావు, రెహమాన్, సత్యనారాయణ, ఆదినారాయణ, నాగమణి, కరీం, శోభన్, చంద్రకళ, భత్తుల రాణి, రాంబాబు, రహీం, పద్మ, శ్రీను, నాగరాజు, మహాలక్ష్మి పాల్గొన్నారు.