వైఎస్సార్ పట్టాలిస్తే..కేసీఆర్ లాక్కుంటుండు

వైఎస్సార్ పట్టాలిస్తే..కేసీఆర్ లాక్కుంటుండు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోడు భూములకు పట్టాలిస్తే... కేసీఆర్ హరిత హారం పేరుతో ఫారెస్ట్ అధికారులతో భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. కొమ్రం భీమ్ జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు సీపీఐ నేతలు చేపట్టిన పోడుయాత్ర ఇల్లందు చేరుకుంది. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని 2005లో పార్లమెంట్ చేసిన చట్టం....ఇప్పటివరకు అమలు కాలేదన్నారు చాడ వెంకటరెడ్డి. వెంటనే పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులను నిలిపివేయాలన్నారు. గిరిజనులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు చాడ.