13 కోట్ల ఓట్ల గల్లంతు వెనుక బీజేపీ కుట్ర : సీపీఐ నేత నారాయణ

13 కోట్ల ఓట్ల గల్లంతు వెనుక బీజేపీ కుట్ర :  సీపీఐ నేత నారాయణ

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్ల గల్లంతు వెనుక బీజేపీ, ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ల కుట్ర దాగి ఉందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని చిక్కడపల్లిలో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. చిక్కడపల్లిలో స్థానికంగా నివసిస్తున్న ఓటర్లు అక్కడ అందుబాటులో లేరంటూ, వారు చనిపోయినట్లుగా బీజేపీ బూత్ స్థాయి కమిటీ నాయకులు'ఫామ్-7' ద్వారా ఎన్నికల అధికారులకు దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. 

దీనిపై ఆఫీసర్లకు అనుమానం వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. జాబితాలో పేర్కొన్న ఓటర్లు అందరూ అక్కడే నివసిస్తున్నట్లు తేలిందని వివరించారు. ఇదే మోడల్‌‌‌‌‌‌‌‌ను దేశవ్యాప్తంగా అమలు చేసి కోట్ల సంఖ్యలో ఓటర్లను తొలగించారని ఆరోపించారు. బూత్ లెవల్ కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాలని కేంద్రమంత్రి  అమిత్ షా పదేపదే పిలుపునివ్వడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. ‘ఫామ్-7’లను దుర్వినియోగం చేసి విపక్షాల ఓట్లను తొలగించడమేనని మండిపడ్డారు.