
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. “బీజేపీలో చేరిన నేరస్తులంతా గంగిగోవులు అవుతున్నారన్నారు. ముకుల్ రాయ్ లాంటి శారదా చిట్ ఫండ్స్ కంపెనీ నిందితులు బీజేపీలో చేరగానే కేసు నుంచి తప్పించుకున్నారని నారాయణ అన్నారు.
మార్కెట్లో ధరలు విపరీతంగా పెరుగుతుంటే.. ప్రధాని మోడీ అమెరికాలో ట్రంపు తో విన్యాసాలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల వల్ల కార్పొరేట్ల ఆస్తులు పెరుగుతుంటే, పేదలు ఆకలి చావులు చస్తున్నారని నారాయణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు.
హైదరాబాదులో వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నారాయణ ఈ సందర్భంగా అన్నారు.