మంత్రి వివేక్ను కలిసిన సీపీఐ నేతలు

మంత్రి వివేక్ను కలిసిన సీపీఐ నేతలు

హైదరాబాద్, వెలుగు: కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని సోమవారం సీపీఐ నేతలు కలిశారు. సోమాజిగూడలోని ఆయన నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల రక్షణ చట్టాన్ని రూపొందించేందుకు విధాన సిఫార్సులతో కూడిన పత్రాన్ని, నివేదికను ఆయనకు అందజేశారు.

నివేదికను అందించినందుకు నేతలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గిగ్ కార్మికుల రక్షణ చట్టాన్ని అధ్యయనం చేసి మరిన్ని సూచనలు ఇవ్వాలని వారిని మంత్రి వివేక్ కోరారు.  మంత్రిని కలిసినవారిలో సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.