మోడీ టూర్ : ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆందోళన

మోడీ టూర్ : ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆందోళన

పెద్దపల్లి : ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు జరుతున్నాయి. మోడీ పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన స్థానిక ప్రతిపక్ష నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీసీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్యను గోదావరిఖని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటన, సభలో ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. 

ఏపీ రాష్ట్రానికి ప్రధాని మోడీ అన్యాయం చేశారని వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఏపీని అన్ని ‌విధాలుగా మోసం చేసి, సిగ్గు లేకుండా రాష్ట్రానికి వస్తున్నారని విమర్శించారు. ఏపీకి మోడీ ప్రభుత్వం ఒక్క అంశంలో అయినా న్యాయం చేసిందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదా లేదు, పోలవరం పూర్తి కాలేదని వారు ఆరోపించారు. విభజన హామీలు అమలు‌ చేయకపోయినా ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. మోడీ పర్యటనలో ఎలాంటి నిరసనలు, ఆందోళనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మూడు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.