- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, వెలుగు: కర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్ చర్యలు నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వచ్చేలా కేంద్రం చొరవ చూపి, అందుకు తగిన మార్గాన్ని సుగమం చేయాలని ఓ ప్రకటనలో కోరారు.
మావోయిస్టులు సైతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఎత్తుగడలు మార్చుకోవాలని, జనజీవన స్రవంతిలోకి వచ్చి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని విస్తరించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. కార్పొరేట్ల కోసమే అడవుల ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.
