పెట్రో ధరల పెంపుపై మే 6న సీపీఐ నిరసన

పెట్రో ధరల పెంపుపై  మే 6న  సీపీఐ నిరసన

హైదరాబాద్, వెలుగు: గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు, కొరతకు వ్యతిరేకంగా ఈ నెల 6న సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పార్టీ  రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలను కోరారు. పంట కోతల సమయంలో డీజిల్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారని వాపోయారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల రేట్లను రూ. 993 పెంచడంతో రూ.3,100కు చేరుకుందని,  డీజిల్, పెట్రోల్‌‌పై  లీటరు రూ.5 చొప్పున, డొమెస్టిక్​ సిలిండర్లపై రూ.50చొప్పున పెంచడానికి ఆయిల్ కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయన్నారు. అమెరికా,- ఇరాన్ యుద్ధంతో దేశానికి ఎలాంటి ప్రమాదం లేదని, చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు గ్యాస్ ధరలు పెంచుతోందని  కూనంనేని నిలదీశారు.