DMK-CPM : కుదిరిన పొత్తులు

DMK-CPM : కుదిరిన పొత్తులు

తమిళనాడులో డీఎంకే, సీపీఎం మధ్య పొత్తులు కుదిరాయి. లోక్ సభ ఎన్నికల్లో సీపీఎంకు రెండు సీట్లు ఇచ్చేందుకు డీఎంకే ఒప్పుకుందని లెఫ్ట్ నేతలు తెలిపారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే, పీఎంకే కూటమిని ఓడిస్తామన్నారు సీపీఎం నేత కే. బాలకృష్ణన్.

అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో డీఎంకేకు మద్దతు ఇస్తామని సీపీఎం నేతలు ప్రకటించారు. స్టాలిన్ తో జరిగిన భేటీలో పొత్తులు, ఎన్నికల వ్యూహాలపై రెండు పార్టీల నేతలు చర్చించారు.