- జాన్ వెస్లీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా.. కల్లు గీత కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 లక్షలకుపైగా కల్లు గీత కార్మిక కుటుంబాలు ఉన్నాయని, గత రెండేండ్ల కాలంలో చెట్లెక్కి కిందపడి వృత్తికి దూరమైన కార్మికులు 850 మంది ఉన్నారని, మరో 140 మంది చనిపోయారని, ఇంకో 170 మంది శాశ్వతంగా దివ్యాంగులయ్యారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వారికి ఇస్తామన్న రూ.5 లక్షలు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. గీత కార్మికులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.14 కోట్లను విడుదల చేయాలన్నారు. అలాగే, ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతామన్న కామారెడ్డి డిక్లరేషన్‌ను ఇప్పటికీ అమలు చేయడం లేదని మండిపడ్డారు.
