జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట సీపీఎం నేతల ధర్నా

జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట సీపీఎం నేతల ధర్నా

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు లబ్ధిదారులతో కలిసి సీపీఎం పార్టీ ధర్నా చేపట్టింది. లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేపట్టాలని సీపీఎం నేతలు అన్నారు. 6 ఏళ్ల క్రితం డబల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని చెప్పిన హామీని వెంటనే నెరవేర్చలని వారు తెలిపారు. లేదంటే లబ్ధిదారులతో కలిసి ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కొత్త దరఖాస్తులను మళ్లి తీసుకోవాలని.. అప్లై చేసుకోని వారుకి అవకాశం ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేశారు.