ఆదివాసీలపై అక్రమ కేసులు ఎత్తేయాలి

ఆదివాసీలపై అక్రమ కేసులు ఎత్తేయాలి

మంచిర్యాల: పోడు భూములకు వెంటనే పట్టాలివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలివ్వాలనే డిమాండ్ తో  సోమవారం సీపీఎం నాయకులు చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... గత ఎన్నికల ముందు పోడు రైతులకు పట్టాలిస్తానని.. తానే స్వయంగా వెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన కేసీఆర్‌ మాట తప్పారని విమర్శించారు. ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసులు పెడుతూ... దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు, ఆర్ధికంగా ఎదిగేందుకు కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు.