రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి..బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు జాన్ వెస్లీ డిమాండ్‌‌‌‌

రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి..బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు జాన్ వెస్లీ డిమాండ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్‌‌‌‌ చేశారు. లేదంటే రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేయాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించి, అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లును రూపొందించి కేంద్రానికి పంపిస్తే, ఆరు నెలలైనా రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం రాష్ట్రపతి అయినా సరే బిల్లులపై 3 నెలల్లోగా తేల్చాలి.. లేదా వెనక్కి పంపించాలన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.