పేదల ఇండ్లు కూల్చడమే కాంగ్రెస్ మార్క్ పాలనా? : జాన్వెస్లీ 

పేదల ఇండ్లు కూల్చడమే కాంగ్రెస్ మార్క్ పాలనా? : జాన్వెస్లీ 
  • పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే పోరాటం ఉధృతం చేస్తాం: జాన్​వెస్లీ 

హైదరాబాద్, వెలుగు: బడా బాబులు, కార్పొరేట్ సంస్థలకు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదలు తలదాచుకోవడానికి సెంటు భూమి అడిగితే వారిపై లాఠీచార్జి చేయడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు కూల్చడమే కాంగ్రెస్​మార్క్​పాలనా అని ప్రశ్నించారు.

నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘చలో సీఎం క్యాంప్ ఆఫీస్’కు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రగా వెళ్తున్న జాన్‌‌వెస్లీ సహా పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.