రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ తర్వాత ఫ్రీ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తేనే.. మా జీతాల్లో కట్ చేయండి : సీపీ ఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ తర్వాత ఫ్రీ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తేనే.. మా జీతాల్లో కట్ చేయండి : సీపీ ఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
  •     సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ 

హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ ఉద్యోగులకు వచ్చేది అరకొర పింఛన్ అని.. దాంతోనే బతకడం ఎలా అని భయపడుతుంటే.. ఇప్పుడు హెల్త్ స్కీమ్ పేరుతో జీతాల్లో కోత పెడ్తామంటే ఊరుకోబోమని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఉచిత వైద్యం అందిస్తామని గ్యారెంటీ ఇస్తేనే.. తమ జీతాల్లో పైసలు కట్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన  మీడియాతో మాట్లాడారు. 

ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్ కోసం ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం చందా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంపై సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన మొదలైందని తెలిపారు. ఇప్పటికే  సీపీఎస్ కోసం బేసిక్, డీఏలో 10 శాతం కోత విధిస్తుందని చెప్పారు. పదవీ విరమణ తర్వాత ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తేనే.. సీపీఎస్ ఉద్యోగులు ఈ కోతకు సమ్మతిస్తారని ఆయన పేర్కొన్నారు.