ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం.. క్రేన్ డ్రైవర్ మృతి

ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం.. క్రేన్ డ్రైవర్ మృతి

టోలిచౌకి- షేక్ పేట్ రూట్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ దగ్గర తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. పిల్లర్ పై దిమ్మె ఫిక్స్ చేసే సమయంలో క్రేన్ బోల్తాపడింది. ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ చనిపోయాడు. మెహిదీపట్నం నుంచి హైటెక్ సిటీ, కొండాపూర్ వెళ్లే ప్రధాన రహదారిలో ప్రమాదం జరగటంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం నాలుగైదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.